Kanakamedala: చంద్రబాబు ఇంటిపై దాడి.. వైకాపా కుట్రలో భాగమే: కనకమేడల - telugu news kanakamedala ravindra kumar press meet in delhi
close
Updated : 17/09/2021 19:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kanakamedala: చంద్రబాబు ఇంటిపై దాడి.. వైకాపా కుట్రలో భాగమే: కనకమేడల

దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం వైకాపా కుట్రలో భాగమేనని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయ శత్రువులుగా మార్చి అంతం చేయాలని కుట్ర పన్నారని తెలిపారు. దిల్లీలో కనకమేడల మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు తీసుకున్నాక విపక్ష నేతలపైనే కేసులు నమోదయ్యాయని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగినా ఎలాంటి కేసు నమోదు చేయాలేదని ఆక్షేపించారు. సీసీ టీవీల్లో రికార్డయిన దాడి దృశ్యాలను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఏ విధంగా చంద్రబాబు నివాసానికి రాగలిగారు.. ఇందులో పోలీసులు ప్రమేయం ఏమైనా ఉందా? అనే విషయంలో డీజీపీ సమాధానం చెప్పాలని కనకమేడల డిమాండ్ చేశారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని