Bollywood: పోరాట సాధన - telugu news kangana ranaut preparing for dhaakad
close
Published : 26/07/2021 11:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bollywood: పోరాట సాధన

ముంబయి: పాత్ర కోసం ఎంతటి సాహసానికైనా వెనకాడని బాలీవుడ్‌ నటుల్లో కంగనా ఒకరు. ఆమె కత్తి యుద్ధాలు నేర్చుకుంటుంది. గుర్రం స్వారీ అభ్యసిస్తుంది. అలాగే ఫైట్లూ చేస్తుంది. ప్రస్తుతం ఆమె ‘ధాకడ్‌’ చిత్రంలో తన పాత్ర కోసం వీధుల్లో అబ్బాయిలతో తలపడటం ఎలాగో సాధన చేస్తోంది. ఇటీవల ఈ వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. ఇది నెట్టింట వైరల్‌ అవుతోంది. కొందరు నటులు ఆమెకు జాగ్రత్తలు  చెబుతుంటే... మరికొందరు ‘సూపర్‌’ అంటూ ప్రోత్సహిస్తున్నారు. రజనీష్‌ ఘాయ్‌ తెరకెక్కిస్తున్న ‘ధాకడ్‌’ నుంచి ఇప్పటికే పోస్టర్‌ విడుదలై ఆకట్టుకుంది. ఇందులో అర్జున్‌ రాంపాల్‌ మరో ముఖ్యపాత్ర  పోషిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో వస్తున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్‌ మంచి ఫైటర్‌గా కన్పించనుంది. బుడాపెస్ట్‌లో ఇటీవల ఈ చిత్ర షెడ్యూల్‌ పూర్తైంది. ఆగస్టు నుంచి మరో షెడ్యూల్‌ మొదలుకానుంది. దీనికోసమే కంగనా సాధనని బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. కంగనా ఇప్పటికే ‘తలైవి’ పూర్తి చేసింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని