Kangana Ranuat: అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - telugu news kangana ranauts incredible transformation in thalaivi dhaakad
close
Published : 28/07/2021 11:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kangana Ranuat: అప్పుడు అలా... ఇప్పుడు ఇలా

ముంబయి: కంగనా రనౌత్‌...నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసేస్తుంది. ఈ జాతీయ ఉత్తమ నటి సత్తా ఏంటో గత చిత్రాల్లో చూశాం. తన విషయంలో సినిమా సినిమాకు పాత్రలు మారుతూ ఉంటాయి. ఓ చిత్రంలో చారిత్రక పాత్ర పోషిస్తే ఇంకో సినిమాలో ఆధునిక యువతిగా నటించొచ్చు. దీనికి ఆహార్యం మారితే సరిపోతుంది. కానీ కొన్ని పాత్రలు పోషించాల్సి వచ్చినప్పుడు శరీరం రూపురేఖలు కూడా మారాల్సి ఉంటుంది. అలాంటి పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు సవాల్‌గానే అనిపిస్తుంది. జయలలిత జీవిత కథలో కంగన నటిస్తున్న చిత్రం ‘తలైవి’. ఈ చిత్రంలో ఆమె ఒక దశలో బాగా లావుగా కనిపించాల్సి వచ్చింది. దాని కోసం బరువు పెరిగింది. నటించింది. సినిమాను పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె నటిస్తున్న చిత్రం ‘ధాకడ్‌’. ఇందులో ఆమె ఫైటర్‌గా యాక్షన్‌ బాట పట్టే పాత్ర. దీనికి శరీరం ఫిట్‌గా నాజుగ్గా ఉండాలి. ఆ విధంగానే ఆ పాత్రలోకి మారింది. ఇప్పుడు ఆ సినిమా చిత్రీకరణ చేస్తుంది. అతి తక్కువ సమయంలో అలా మారాలంటే చాలా శ్రమించాల్సి వస్తుంది. అందుకు నేను సిద్ధమే అంటోంది కంగన. తాజాగా ‘తలైవి’లో బొద్దుగా ఉన్న ఫొటో, ‘ధాకడ్‌’లో ఫిట్‌గా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. ‘ఎవరూ చేయని ప్రయాణం ఇది’ అని పోస్ట్‌ చేసింది. అవును కంగన కష్టం కనపడుతుంది. అద్భుతం అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘తలైవి’ చిత్రం సిద్ధమైనా ఇంకా విడుదల తేదీ ఖరారు కాలేదు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని