Tokyo Olympics: ఒలింపిక్స్‌లో ఆరు గోల్డ్‌ మెడల్స్‌ లెడిక్కీవే - telugu news katie ledecky first female swimmer to have 6 olympic gold medals
close
Published : 01/08/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో ఆరు గోల్డ్‌ మెడల్స్‌ లెడిక్కీవే

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒలింపిక్స్‌ మహిళల స్విమ్మింగ్‌ విభాగంలో అమెరికా స్విమ్మర్‌ కేటీ లెడిక్కీ శనివారం కొత్త చరిత్ర సృష్టించింది. ఆమె ఒలింపిక్స్‌ కెరీర్‌లో వ్యక్తిగతంగా మొత్తం 8 బంగారు పతకాలు సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. ఈరోజు టోక్యో ఒలింపిక్స్‌లో జరిగిన మహిళల 800 మీటర్ల ఫ్రీస్టైల్‌ ఈత పోటీల్లో ఈ అమెరికా క్రీడాకారిణి అగ్రస్థానంలో నిలిచి ఈ ఒలింపిక్స్‌లో రెండో బంగారు పతకం సాధించింది. అంతకుముందు 1500 మీటర్ల విభాగంలోనూ మరో గోల్డ్‌ తన ఖాతాలో వేసుకుంది.

ఇక ఆస్ట్రేలియాకు చెందిన అరియర్న్‌ టిట్మస్‌ ఈ పోటీల్లో రెండో స్థానంలో నిలిచి రజతం సంపాదించగా.. ఇటలీ స్విమ్మర్‌ సిమోనా క్వాడరెల్లా కాంస్యం కైవసం చేసుకుంది. లెడిక్కీ 1500 మీటర్లలోనూ టిట్మస్‌ను ఓడించి బంగారు పతకం సాధించడం గమనార్హం. అలాగే ఈసారి ఒలింపిక్స్‌ ఈ అమెరికా స్విమ్మర్‌ మరో రెండు వెండి పతకాలు కూడా సొంతం చేసుకుంది. కాగా, 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె ఇంతకన్నా మెరుగైన ప్రదర్శన చేసింది. అప్పుడు ఏకంగా నాలుగు బంగారు పతకాలు సాధించగా ఒక వెండి పతకాన్ని కూడా సొంతం చేసుకుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని