SarkaruVaariPaata: కీర్తి సురేశ్‌ పాత్ర ఇదేనా..! - telugu news keerthy suresh character in sarkaruvaaripaata
close
Published : 10/08/2021 10:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SarkaruVaariPaata: కీర్తి సురేశ్‌ పాత్ర ఇదేనా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకుడు. మహేశ్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న టీజర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. ఇందులో మహేశ్‌ బాబు చెప్పిన డైలాగులు, ఫైట్లు అభిమానుల్ని విశేషంగా అలరించాయి. మహేశ్‌- కీర్తి జోడీ చూడముచ్చటగా ఉంది. అయితే ఈ ఇద్దరి పాత్రల పేర్లు మాత్రం బయటపెట్టలేదు చిత్ర బృందం. మహేశ్‌ మాత్రం కీర్తి పాత్రని రివీల్‌ చేశారు. అదెలా అంటారా? సామాజిక మాధ్యమాల వేదికగా తనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ రిప్లై ఇచ్చారు మహేశ్‌. అలా అందరికీ కేవలం థ్యాంక్స్‌ చెప్పిన మహేశ్‌.. కీర్తి సురేశ్‌కి మాత్రం ‘థ్యాంక్‌ యు, కళావతి’ అని ట్వీట్‌ చేశారు. దాంతో ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ కళావతిగా నటిస్తుందని ఫిక్స్‌ అయిపోయారు అభిమానులు. మరి మహేశ్‌ పాత్ర పేరేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 ప్లస్‌ రీల్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2022 జనవరి 13న విడుదల కానుంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని