Kiran Abbavaram: కోడి రామకృష్ణ కుమార్తె నిర్మాతగా - telugu news kiran Abbavaram New Movie Launched
close
Updated : 09/10/2021 07:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kiran Abbavaram: కోడి రామకృష్ణ కుమార్తె నిర్మాతగా

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారారు. కోడి దివ్య ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై నరేష్‌రెడ్డి ములెతో కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్‌ అబ్బవరం, సంజన ఆనంద్‌ జంటగా నటిస్తున్నారు. కార్తీక్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రామలింగేశ్వర రావు క్లాప్‌నిచ్చారు. మరో నిర్మాత ఎ.ఎం.రత్నం కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నిర్మాతలు అల్లు అరవింద్‌, మురళీమోహన్‌, దర్శకనిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, సంగీత దర్శకుడు కోటి, నటుడు రాజారవీంద్ర హాజరయ్యారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. కార్తీక్‌శంకర్‌ తయారు చేసిన స్క్రిప్ట్‌ చాలా బాగుంది. నిర్మాత దీప్తి తన సంస్థలో తీస్తున్న తొలి సినిమాలో నేను హీరో కావడం సంతోషంగా ఉంది. సంగీత దర్శకుడు మణిశర్మ, గీత రచయిత భాస్కరభట్ల, ఛాయాగ్రాహకుడు రాజ్‌ కె.నల్లి... ఇలా ఓ మంచి సాంకేతిక బృందం కలిసి చేస్తున్న చిత్రమిది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘మంచి సినిమాల్ని తీయడమే లక్ష్యంగా తొలి అడుగు వేస్తున్నాం’’ అన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని