Kishan Reddy: దేశంలో డిసెంబర్‌లోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తాం - telugu news kishan reddy on covid vaccinationa
close
Updated : 23/08/2021 14:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kishan Reddy: దేశంలో డిసెంబర్‌లోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తాం

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా డిసెంబర్‌లోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో పర్యటించిన ఆయన.. గాంధీ ఆస్పత్రిని పరిశీలించారు. అక్కడ కొవిడ్‌ బాధితులకు అందుతున్న వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. చిన్నపిల్లలకు వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. ఆధార్‌ కార్డు లేని వారికి పాస్‌పోర్టు ద్వారా టీకా పంపిణీ చేస్తాం. దేశంలో ఆక్సిజన్‌ కొరత రాకుండా పీఎం కేర్స్‌ కింద 1200కుపైగా ఆక్సిజన్‌ ప్లాంట్‌లను నెలకొల్పాం. గాంధీలో 8 ఆక్సిజన్‌ యూనిట్లు పనిచేస్తున్నాయి. వీటికి అదనంగా మరో ఆరింటిని ఏర్పాటు చేస్తున్నాం’ అని కిషన్‌రెడ్డి వివరించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని