Krithi Shetty: కృతిశెట్టి పుట్టిన రోజు వేడుకని చూశారా..! - telugu news krithi shetty birthday celebrations on aa ammayi gurinchi meeku cheppali movie sets
close
Published : 22/09/2021 21:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Krithi Shetty: కృతిశెట్టి పుట్టిన రోజు వేడుకని చూశారా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఉప్పెన’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే నటిగా కృతిశెట్టి మంచి పేరుతెచ్చుకుంది. వరుస అవకాశాలు అందుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సుధీర్‌ బాబు సరసన ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. బెంచ్‌ మార్క్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా సెట్స్‌లో కృతిశెట్టి పుట్టినరోజు వేడుకని చిత్ర బృందం నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ తాజాగా విడుదల చేసింది. కృతిశెట్టి కేక్‌ కట్‌చేసి, చిత్ర బృంద సభ్యులకు తినిపిస్తూ కనిపించింది. కృతికి హ్యాపీ బర్త్‌డే చెప్తూ సెట్స్‌లో ఉన్నవారంతా సందడి చేశారు. ‘సమ్మోహనం’, ‘వి’ తర్వాత సుధీర్‌- మోహన్‌ కృష్ణ కాంబోలో రూపొందుతున్న చిత్రమిది. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం: పి.జి.వింద.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని