Bigg Boss Telugu 5: లోబో విశ్లేషణతో కన్నీళ్లు పెట్టుకున్న అనీ.. మొహం మాడ్చుకున్న రవి - telugu news latest episode of biggboss telugu 5
close
Updated : 24/10/2021 10:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: లోబో విశ్లేషణతో కన్నీళ్లు పెట్టుకున్న అనీ.. మొహం మాడ్చుకున్న రవి

హైదరాబాద్‌: వారం మొత్తం టాస్క్‌లు, మాటల యుద్ధాలు, వాగ్వాదాలు, చర్చలతో నడిచే ‘బిగ్‌బాస్‌’ ప్రతి శనివారం నాగార్జున ఇచ్చే తీర్పులతో ఆసక్తిగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈవారం హౌస్‌లో జరిగిన రచ్చలకు నాగార్జున ముందు పెద్ద పంచాయితీనే ఉంటుందని అందరూ ఊహించారు. శుక్రవారం జరిగిన విశేషాలను నాగార్జునే స్వయంగా వీక్షించారు. కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్‌ సందర్భంగా సిరి స్టిక్కర్లను తానే దొంగిలించినట్లు రవి ఇంటిసభ్యులకు చెప్పాడు. ఈ విషయాన్ని ప్రియ నెమ్మదిగా సిరికి ఊదేసింది. అనంతరం నిర్వహించిన మ్యాట్రిమోనీ ఈవెంట్‌లో ప్రియాంక-మానస్‌లకు వివాహ తంతు జరిగింది. ఈ వీడియోలను వీక్షించిన నాగార్జున హౌస్‌మేట్స్‌ ముందుకు వచ్చి.. వరెస్ట్‌ కంటెస్టెంట్‌ ఎవరో చెప్పాలని అడిగాడు. అత్యధిక ఓట్లతో విశ్వ ఈ వారం వరెస్ట్‌ కంటెస్టెంట్‌గా నామినేట్‌ అయ్యాడు. దీంతో సోమవారం విశ్వను జైలులోకి వెళ్లాలని నాగ్‌ సూచించాడు.

సన్నీ-ప్రియాలలో తప్పెవరిది? నాగ్‌ విశ్లేషణ:

‘బంగారు కోడిపెట్ట టాస్క్‌’ సందర్భంగా చెంపపగల కొడతానంటూ సన్నీతో మాటల యుద్ధానికి దిగిన ప్రియపై నాగార్జున ఎలాంటి క్లాస్‌ తీసుకుంటాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. మొదటి నుంచి ప్రియ విషయంలో బిగ్‌బాస్‌ టీమ్‌ అనుసరిస్తున్న పంథానే ఈ వారమూ కొనసాగించారు. ‘చెంప పగలకొడతా అని అన్నిసార్లు అనలా అమ్మ. ఇదేమీ బాలేదు’ అంటూ సింపుల్‌గా నాగ్‌ ముగించేశాడు. ‘నేనేమీ అనలేకపోయాను సర్‌’ అని సన్నీ అనగా.. ‘నువ్వేం అంటావ్‌లే.. జెస్సీ మీదకు మాత్రం వెళ్లగలవ్‌’ అని వెటకారంగా నాగ్‌ సమాధానమిచ్చారు. ప్రియ చేసిన రచ్చంతా సన్నీపై తోసినట్లు వీడియోల్లో చూపించారు. అది చూసిన సన్నీ వ్యంగ్యంగా నవ్వాడు.

అనంతరం ప్రియాంక-విశ్వల మధ్య జరిగిన తోపులాటపై కూడా నాగార్జున మాట్లాడారు. కాస్త చూసుకుని ఆడాలని విశ్వకు నాగ్‌ సూచించాడు. రవి గేమ్స్‌లో స్ట్రాటజీలు బాగుంటున్నాయని.. కానీ, ఆటలో దొరక్కుండా ఉండేందుకు అమ్మతోడు అంటూ అతను అబద్ధాలు ఆడటం బాలేదని నాగార్జున హితవు పలికాడు. కెప్టెన్సీ టాస్క్‌ సందర్భంగా కొందరు గ్రూపులుగా ఆడారని అనీ మాస్టర్‌ వాపోయింది. దీంతో సన్నీ కెప్టెన్సీని క్యాన్సిల్‌ చేస్తున్నట్లు నాగ్‌ ప్రకటించారు. దీనిపై సన్నీ వివరణ ఇచ్చాడు. తనని ఒక్కడినే చేసి తన బుట్టలోని గుడ్లను మాత్రమే టార్గెట్‌ చేశారని.. తాను ఎవరి వద్ద నుంచి ఎగ్స్‌ తీసుకోలేదని సన్నీ చెప్పాడు. కేవలం గుడ్లను కాపాడుకునేందుకే కాజల్‌ సాయం తీసుకున్నట్లు చెప్పాడు.

ఎవరు డూపు ఎవరు తోపు చెప్పిన లోబో:

ఇంటి సభ్యులందర్నీ వరెస్ట్‌ ఫెర్ఫార్మర్‌ ఎవరో చెప్పాలని అడిగిన నాగార్జున.. సీక్రెట్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చిన లోబోని మాత్రం అడగలేదు. అందుకు భిన్నంగా అతన్ని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచాడు. ‘‘ఈవారం హౌస్‌లో ఉన్న వాళ్లందరి ఆట చూశావు కదా. నీ విశ్లేషణ ప్రకారం ఎవరు డూపు ఎవరు తోపు చెప్పు’’ అని నాగ్‌ అడిగాడు. ఈ సందర్భంగా లోబో.. రవి, కాజల్‌, ప్రియ, ప్రియాంక, షణ్ముఖ్‌, అనీ మాస్టర్‌లు డూపులని ప్రకటించి.. మిగిలిన ఆరుగురు తోపులని వివరణ ఇచ్చాడు. లోబో చెబుతున్నవన్నీ.. లైవ్‌లో కంటెస్టెంట్స్‌కి చూపించాడు. అది చూసిన అనీ మాస్టర్‌ కన్నీళ్లు పెట్టుకుంది. ఊహించని రీతీలో తనని డూపు అని చెప్పడంతో రవి మొహం మాడిపోయింది. హౌస్‌మేట్స్‌కి ఈ విషయాన్ని చూపించారని తెలియక.. కన్ఫెషన్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చిన లోబో.. ‘‘ఏం చెప్పలేదు. అంతా గ్యాస్‌’’ అనగానే ఇంటి సభ్యులందరూ నవ్వుకున్నారు. చివరిగా ఈ వారం నామినేషన్‌లో ఉన్న వాళ్లలో కాజల్‌, శ్రీరామ్‌ సేఫ్‌ అయ్యారు. మిగిలిన వాళ్లలో ఎవరు సేఫ్‌ అవుతారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? తెలియాలంటే ఈరోజు జరగబోయే ఎపిసోడ్‌ చూడాల్సిందే.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని