Bigg boss Telugu 5: ఇష్టమొచ్చినట్టు మాట్లాడావ్‌.. ఎవరికి కావాలి నీ సారీ? - telugu news latest promo of bigg boss
close
Updated : 27/10/2021 17:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg boss Telugu 5: ఇష్టమొచ్చినట్టు మాట్లాడావ్‌.. ఎవరికి కావాలి నీ సారీ?

హైదరాబాద్‌: కెప్టెన్సీ పోటీదారుల ఎంపికలో భాగంగా బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ల్లో ఇంటి సభ్యులు హోరాహోరీగా పాల్గొంటున్నారు. ‘అభయహస్తం’ టాస్క్‌ నిమిత్తం ఇంటి సభ్యులందరికీ బిగ్‌బాస్‌ కొన్ని ఛాలెంజ్‌లు ఇచ్చాడు. వాటిల్లో గెలుపొందిన షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌ ఇప్పటికే బిగ్‌బాస్‌ ఇంటిలోకి అడుగుపెట్టారు. మిగిలిన వాళ్లు ఛాలెంజ్‌లను స్వీకరించడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తాజాగా ప్రియాంక-అనీ మాస్టర్లకు బిగ్‌బాస్‌ ‘రంగు పడుద్ది’ టాస్క్‌ ఇచ్చాడు. అనీ మాస్టర్‌.. ప్రియాంకలకు తలో రంగు ఇచ్చి.. ఓ తెల్లని గోడకు పెయింట్‌ వేయమని చెప్పాడు. బజర్‌ మోగేసరికి గోడపై ఎవరి రంగు అయితే ఎక్కువ కనిపిస్తుందో వారే విజేతలని బిగ్‌బాస్‌ సూచించాడు. దీంతో అనీ-ప్రియాంక హోరాహోరీగా తలపడి.. తడబడి.. కిందపడ్డారు. మరోవైపు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ నుంచి ఎవరు డ్రాప్‌ అవుతారనే విషయంపై ఇంటి సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ‘‘ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్నవాళ్లు.. ఇంతకు ముందు కెప్టెన్‌గా చేసినవాళ్లు ఈసారి బరి నుంచి వైదొలగమని చెబుతున్నారు. ఎవరో ఒక్కరు తప్పుకోవాలి కాబట్టి.. నేనే తప్పుకుంటున్నా. నాకు ఈ వారం వరెస్ట్‌ పర్ఫార్మర్‌ ఇచ్చినా నాకనవసరం’’ అంటూ జెస్సీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జెస్సీ కోపానికి కారణమేమిటి? రంగు పడుద్దిలో ఎవరు విజేతగా నిలిచారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే..!




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని