Rashmi: ఇకపై తన బాధ్యత నాదే: రష్మి - telugu news latest promo of extra jabardasth
close
Published : 15/08/2021 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rashmi: ఇకపై తన బాధ్యత నాదే: రష్మి

జూనియర్‌ ఆర్టిస్ట్‌ వెంటపడిన రౌడీలు.. ట్రెండింగ్‌లో వీడియో

హైదరాబాద్‌: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. ఈ సినిమా విడుదలైన కొత్తలో ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్‌ని అలవోకగా రీక్రియేట్‌ చేసి అందరి దృష్టిని తమవైపుకు తిప్పుకున్నారు నెల్లూరు కుర్రాళ్లు. ఇప్పుడు ఆ కుర్రాళ్లే ‘ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌’ స్టేజ్‌పై తళుక్కున మెరిశారు. రాకేశ్‌ ‘వకీల్‌సాబ్‌’ స్పూఫ్‌ చేయగా.. యాక్షన్‌ సీక్వెన్స్‌లో భాగంగా నెల్లూరు కుర్రాళ్లు నటి రోహిణిని వెంటపడతారు. రాకేశ్‌ వాళ్లందర్నీ నిలువరించి ఫన్నీ, పంచ్ డైలాగ్‌లతో అలరించారు. ‘బాహుబలి’ థీమ్‌తో వచ్చిన భాస్కర్‌ టీమ్‌లో ‘కట్టప్ప’గా సుధీర్‌ సందడి చేశారు.

ఇదిలా ఉండగా.. నిజ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని విషయాలు పంచుకోవాలని ఎపిసోడ్‌ చివర్లో రష్మి అందర్నీ అడిగారు.. ‘నేను ఎందుకు ఎత్తు పెరగడం లేదు. నా జీవితం ఏమైపోతుంది అని ఎన్నోసార్లు బాధపడ్డా’ అని నరేశ్‌ చెప్పగానే .. ‘జబర్దస్త్‌ స్టేజ్‌పై ఉన్న ప్రతి క్షణం మా జీవితాల్లో ఆనందకరమైన విషయం’ అని రాకేశ్‌, భాస్కర్‌, జీవన్‌ వివరించారు. అనంతరం సుధీర్‌ మాట్లాడుతూ.. ‘ఈ తొమ్మిదేళ్ల ప్రయాణంలో మొదటిసారి రష్మి-నేను కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం ఇద్దరం కలిసి స్క్రిప్ట్‌లు వింటున్నాం. నా జీవితంలో అదొక సంతోషకరమైన విషయం’ అని చెప్పారు. చివరిగా రష్మి.. ‘తను ఉన్నంతవరకూ తన బాధ్యత నాదేనని ఫిక్స్‌ అయిపోయాను. ఈ నిర్ణయం పట్ల నేనెంతో సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం అదే’ అని కన్నీరు పెట్టుకున్నారు. అయితే రష్మి ఎవరి గురించి చెప్పిందో తెలియాలంటే వచ్చే శుక్రవారం వరకూ వేచి ఉండాల్సిందే..!




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని