Lift collapse: ఆస్పత్రిలో కూలిన లిఫ్టు.. సురక్షితంగా బయటపడ్డ ఉప్పల్‌ ఎమ్మెల్యే - telugu-news-lift collapse in private hospital in uppal
close
Published : 29/07/2021 15:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lift collapse: ఆస్పత్రిలో కూలిన లిఫ్టు.. సురక్షితంగా బయటపడ్డ ఉప్పల్‌ ఎమ్మెల్యే

ఉప్పల్‌: హైదరాబాద్‌ ఉప్పల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో లిఫ్టు కూలింది. ఈ ప్రమాదంలో బోడుప్పల్‌ మేయర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి, బోడుప్పల్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, మరికొంత మందితో కలిసి ఉప్పల్‌ నల్ల చెరువు ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు మరికొంత మంది లిఫ్టులో ఆస్పత్రిలోని పై అంతస్తుకు వెళ్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మేయర్ బుచ్చిరెడ్డి, మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి లిఫ్టు తలుపులను తెరిపించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని