Maestro: నితిన్‌ ‘మాస్ట్రో’ ట్రైలర్‌ ఎప్పుడంటే..! - telugu news maestro trailer date announcement
close
Published : 20/08/2021 14:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Maestro: నితిన్‌ ‘మాస్ట్రో’ ట్రైలర్‌ ఎప్పుడంటే..!

హైదరాబాద్‌: నితిన్‌ హీరోగా తమన్నా కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘మాస్ట్రో’. నభానటేశ్‌ కథానాయిక. మేర్లపాక గాంధీ దర్శకుడు. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘అంధాదున్‌’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈసినిమా మరికొన్ని రోజుల్లో డిస్నీ హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 23న సోమవారం ‘మాస్ట్రో’ ట్రైలర్‌ విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ సరికొత్త పోస్టర్‌ విడుదల చేసింది.

బ్లాక్‌ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘అంధాధున్‌’లో ఆయుష్మాన్‌ ఖురానా, టబు, రాధికా ఆప్టే కీలకపాత్రలు పోషించారు. 2018లో విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సుమారు రూ.32 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈసినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని అంచనా.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని