Maha Samudram: శర్వానంద్‌-సిద్ధార్థ్‌ల ‘మహా సముద్రం’ వచ్చేస్తోంది - telugu news maha samudram release date announcement
close
Published : 27/08/2021 12:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Maha Samudram: శర్వానంద్‌-సిద్ధార్థ్‌ల ‘మహా సముద్రం’ వచ్చేస్తోంది

హైదరాబాద్‌: శర్వానంద్‌-సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాసముద్రం’ విడుదల తేదీ ఖరారైంది. ఈ మేరకు చిత్రబృందం శుక్రవారం మధ్యాహ్నం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 14న ‘మహాసముద్రం’ విడుదల కానుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ విజయం తర్వాత అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. అపురూప ప్రేమకథతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఆదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. జగపతిబాబు, రావురమేశ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందిస్తున్నారు.

మరోవైపు ‘జబర్దస్త్‌’, ‘బాద్‌షా’ తర్వాత సుమారు ఏడేళ్ల విరామం అనంతరం సిద్ధార్థ్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ‘హే రంభ హే రంభ’ పాట ఆకట్టుకున్నాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని