Rambha: హే రంభ.. హే రంభ.. పండుగే ప్రారంభ..! - telugu news maha samudram song out now
close
Updated : 06/08/2021 13:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rambha: హే రంభ.. హే రంభ.. పండుగే ప్రారంభ..!

హైదరాబాద్‌: కట్టిపడేసే కొంటె చూపులు, ఆకర్షించే అందచందాలతో గతంలో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారు నటి రంభ. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు ఈ నటి. కాగా.. తాజాగా ‘మహాసముద్రం’ చిత్రంలో రంభపై ఓ పాట రాశారు. ‘మందే ఇక మనదే.. విశాఖపట్నం బీచ్‌.. తాగొచ్చు.. ఊగొచ్చు.. ఏదైనా చేయొచ్చు. కొట్టేయ్‌.. జై కొట్టేయ్‌ మనమంత రంభ ఫ్యాన్సు.. కట్టేద్దాం బ్యానర్సు.. పెట్టేద్దాం కటౌట్సు’ అంటూ సాగే ఈ మాస్‌ సాంగ్‌ను శుక్రవారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. చైతన్‌ భరద్వాజ్‌ ఆలపించిన ఈ పాటకు శర్వానంద్‌, జగపతిబాబు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ పాట సినీ సంగీత ప్రియుల్ని ఆకర్షిస్తోంది.

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో విజయాన్ని అందుకున్న అజయ్‌ భూపతి రెండో చిత్రంగా ‘మహా సముద్రం’ తెరకెక్కుతోంది. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌, ఆదితి రావు హైదరీ కథానాయికలు. జగపతిబాబు, రావు రమేశ్‌ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని