Odisha: ప్రేమించాడు.. పెళ్లి చేసుకోమందని హతమార్చాడు - telugu news man murder a young woman in odisha
close
Updated : 29/07/2021 10:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Odisha: ప్రేమించాడు.. పెళ్లి చేసుకోమందని హతమార్చాడు

వివరాలు వెల్లడిస్తున్న ఎస్డీపీఓ

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ప్రేమించిన యువతి (25) పెళ్లి కోసం ఒత్తిడి చేస్తుండడంతో అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు (30) ఆమెపై రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ పోసి నిప్పంటించి హతమార్చాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంజాం జిల్లా పురుషోత్తంపూర్‌ ఠాణా పరిధిలోని ప్రతాపపూర్‌ గ్రామంలో మంగళవారం రాత్రి ఎనభై శాతం కాలిన గాయాలతో స్థానిక ఎమ్కేసీజీ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ప్రియురాలు అర్ధరాత్రి తుదిశ్వాస విడిచింది. బుధవారం ఎమ్కేసీజీ ఎఫ్‌ఎంటీలో యువతి మృతదేహానికి పోలీసులు శవపరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇవీ వివరాలు.. గంజాం జిల్లా బుగుడా ప్రాంతానికి చెందిన యువతి, ప్రతాపపూర్‌కు చెందిన కృష్ణచంద్ర సాహు 2015 నుంచి ప్రేమించుకుంటున్నారు. కులాలు అడ్డు వచ్చినా పెళ్లికి సిద్ధమై కొంతకాలం కలసి ఉన్నారు. యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, యువతి ల్యాబ్‌ టెక్నీషియన్‌గా ఇటీవల భంజనగర్‌ సమీపాన ముజాగడలో చేరింది. ‘మంగళవారం నన్ను కృష్ణచంద్ర సాహు ప్రతాపపూర్‌కు రమ్మని పిలిచాడు. గ్రామంలోని ఓ నస్యం పరిశ్రమలో నాపై రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ పోసి నిప్పుపెట్టాడు’ అని యువతి తన మరణ వాంగ్మూలంలో చెప్పిందని పురుషోత్తంపూర్‌ ఎస్డీపీఓ సూర్యమణి ప్రధాన్‌ చెప్పారు. పెళ్లి కోసం ఆమె తరచూ ఆయనపై ఒత్తిడి చేసేదని అన్నారు. బుధవారం మధ్యాహ్నం పురుషోత్తంపూర్‌ ఠాణాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తీవ్రంగా కాలిన గాయాలతో యువతిని తొలుత పురుషోత్తంపూర్‌ ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఎమ్కేసీజీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృతి చెందిందని చెప్పారు. సంఘటనా స్థలంలో రెండు రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ సీసాలు, యువతి పాదరక్షలు, అగ్గిపెట్టె తదితరాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కృష్ణచంద్ర సాహు తన కుమార్తెను హతమార్చాడని యువతి తండ్రి ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తున్నామని, నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఎస్డీపీఓ ప్రధాన్‌ పేర్కొన్నారు. యువతి హత్యతో తనకెలాంటి సంబంధం లేదని, సంఘటన చోటు చేసుకున్న సమయంలో తాను పురుషోత్తంపూర్‌లో వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానంలో పనిచేస్తున్నానని కృష్ణచంద్ర సాహు మధ్యాహ్నం ఠాణాలో విలేకరులకు చెప్పాడు. గ్రామస్థులు ఫోను ద్వారా తనకు ఈ విషయం తెలియజేశారని ఆయన పేర్కొన్నాడు. అయిదేళ్లుగా తమ మధ్య ప్రేమ వ్యవహారం ఉండేదని, రెండేళ్ల కిందట మనస్పర్ధలు వచ్చాయని సాహు పేర్కొన్నాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహు వివాహితుడని తెలిసింది.

కృష్ణచంద్ర సాహు



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని