Manchi Rojulochaie: సంతోష్‌.. ఆనందానికి అడ్రస్‌ ఇతనే..! - telugu news manchi rojulochaie trailer out now
close
Published : 14/10/2021 10:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Manchi Rojulochaie: సంతోష్‌.. ఆనందానికి అడ్రస్‌ ఇతనే..!

హైదరాబాద్‌: ‘ఏక్‌ మినీ కథ’తో పూర్తిస్థాయి హీరోగా సంతోష్‌ శోభన్‌ ఇటీవల మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన సంతోష్‌.. ‘తను నేను’, ‘పేపర్‌బాయ్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. ప్రముఖ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెహరీన్‌ కథానాయిక. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ఈసినిమా ట్రైలర్‌ను చిత్రబృందం గురువారం ఉదయం విడుదల చేసింది. యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

నటీనటుల వరుస పంచులు.. తండ్రికూతుళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలతో ఈ ట్రైలర్‌ సాగింది. ట్రైలర్‌ ఆరంభంలో.. ‘మై డియర్‌ వాట్సాప్‌ అంకుల్స్‌ అండ్‌ యూట్యూబ్‌ అంటీస్‌ నా పేరు సంతోష్‌.. ఆనందానికి అడ్రస్‌ వీడు అనేది నా ట్యాగ్‌ లైన్‌’ అంటూ సంతోష్‌ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఇప్పుడు యూవీ వాళ్లు హై బడ్జెట్‌ రాధేశ్యామ్‌ తీశారు. అలా అని ఊరుకున్నారా? ‘ఏక్‌ మినీ కథ’ కూడా తెరకెక్కించారు.. అలా ఎక్కడ కాన్సెప్ట్‌ ఉంటే అక్కడికి వెళ్లిపోతారు’ అంటూ శ్రీనివాస్‌రెడ్డి చెప్పే డైలాగ్‌లూ మెప్పిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్, మాస్‌ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందించారు. నవంబర్‌ 4న ఈసినిమా విడుదల కానుంది.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని