Manchu Vishnu: మహిళా భద్రతకు కమిటీ: మంచు విష్ణు - telugu news manchu vishnu maa elections
close
Updated : 22/10/2021 19:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Manchu Vishnu: మహిళా భద్రతకు కమిటీ: మంచు విష్ణు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు తన మేనిఫెస్టోను అమలు చేసే దిశగా ముందడుగేశారు. ‘మా’లో మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు విష్ణు తెలిపారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

‘‘విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్రీవెన్స్‌ సెల్‌’ పేరిట కమిటీని ఏర్పాటు చేశామని తెలియజేస్తున్నందుకు గర్వంగా ఉంది. మహిళా సాధికారత కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. పద్మశ్రీ సునీతా కృష్ణన్‌ సలహాదారుగా పనిచేయనున్నారు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని విష్ణు తెలిపారు. ‘మా’లో మరింత మంది మహిళలను భాగస్వాములను చేయడానికి ఈ కమిటీ ద్వారా తొలి అడుగు వేస్తున్నట్లు విష్ణు పేర్కొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని