Navarasa Trailer: అగ్ర తారల వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ అదరహో! - telugu news maniratnam navarasa web series trailer starring suriya prakash raj anjali
close
Updated : 27/07/2021 10:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Navarasa Trailer: అగ్ర తారల వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ అదరహో!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారీ తారాగణంతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మిస్తోన్న వెబ్‌ సిరీస్‌ ‘నవరస’. శాంతం, కరుణ, రౌద్రం, భయానకం.. ఇలా నవరసాల నేపథ్యంలో తొమ్మిది భాగాలుగా ఈ సిరీస్‌ రానుంది. ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సూర్య, సిద్ధార్థ్‌, ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేశ్‌, అరవింద్‌ స్వామి, రోబో శంకర్‌, యోగిబాబు, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 6 నుంచి ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. టైటిల్‌కి తగ్గట్టుగానే అన్ని రకాల భావోద్వేగాలతో ఆద్యంతంగా ఆసక్తిగా సాగింది ఈ ట్రైలర్. ప్రతీ నటుడు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అందరి లుక్స్‌ చాలా కొత్తగా ఉన్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. అగ్ర తారలందరినీ ఒకే వీడియోలో చూస్తుండటం కొత్త అనుభూతిని పంచుతోంది.

ఈ సిరీస్‌ని మరో దర్శకుడు జయేంద్రతో కలిసి నిర్మిస్తున్నారు మణిరత్నం. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన సినీ కార్మికులని ఆదుకోవడమే లక్ష్యంగా ఈ సిరీస్‌ రూపుదిద్దుకుంది. రతీంద్రన్‌ ఆర్‌. ప్రసాద్‌, అరవింద్‌ స్వామి, బిజోయ్‌ నంబియార్‌, గౌతమ్‌ వాసుదేవ మేనన్‌, సర్జున్‌ కె.ఎం, ప్రియదర్శన్‌, కార్తీక్‌ నరేన్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌, వసంత్‌ ఈ తొమ్మిది కథలకి దర్శకత్వం వహించారు. ఇంకెందుకు ఆలస్యం నవరస భరిత ట్రైలర్‌ని చూసేయండి.

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని