అక్షయ్‌...వాణీ ఓ ప్రణయ గీతం - telugu news marjaawaan song from bellbottom out now
close
Published : 07/08/2021 09:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్షయ్‌...వాణీ ఓ ప్రణయ గీతం

అక్షయ్‌కుమార్, వాణీ కపూర్‌ ప్రేమ పక్షుల్లా విదేశీ లోకేషన్లలో ప్రణయ గీతం పాడుకున్న తీరు చూసి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన ‘బెల్‌బాటమ్‌’ చిత్రంలోని రొమాంటిక్‌ గీతం ‘మర్జావాన్‌’ వీడియో గీతం శుక్రవారం విడుదలైంది. అలరించే సంగీతంతో అందమైన విదేశీ లోకేషన్లలో తెరకెక్కించిన ఈ గీతంలో అక్షయ్, వాణీ జంట ఆకట్టుకుంటోంది. ఈ పాటను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు అక్షయ్‌. ‘‘బెల్‌బాటమ్‌’లో నాకు ఎంతో ఇష్టమైన పాట ‘మర్జావాన్‌’. చిత్రీకరణ జరిగినన్ని రోజులు ఈ పాట స్వరం నా బుర్రలో బంధీ అయిపోయింది’’అని ట్వీటారు అక్షయ్‌. ఈ సినిమా ఈ నెల 19 థియేటర్లలో విడుదల కానుంది. దీని గురించి అక్షయ్‌ మాట్లాడుతూ ‘‘అందరిలోనూ ఒత్తిడి ఉంది. కానీ అంతా మంచి జరుగుతుందనే నమ్ముతున్నాం. ఇదో సవాల్, సాహసమే. ఆ మాత్రం రిస్క్‌ తీసుకోకపోతే జీవితంలో మనం చేసేది ఇంకేముంటుంది?’’ అని చెప్పారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని