ప్రభాస్‌ కోసం మరో నాయిక? - telugu news meenakshi chaudhary will play Special Dance number In Saalar
close
Published : 14/10/2021 19:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ కోసం మరో నాయిక?

ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె కాక ప్రత్యేక గీతం కోసం మరో నాయికను రంగంలోకి దింపనున్నారు. ఆ పాత్ర కోసం ఇప్పటికే శ్రీనిధి శెట్టి, శ్రద్ధా కపూర్‌ల పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇప్పుడీ చిత్రం కోసం ‘ఖిలాడీ’ భామ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో శ్రుతితో పాటు మరో నాయిక పాత్రకు ప్రాధాన్యముందని, ఇప్పుడా పాత్ర కోసమే మీనాక్షిని ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో జరగనున్న కొత్త షెడ్యూల్‌లో ఆమె చిత్ర బృందంతో కలవనున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన మాస్‌, యాక్షన్‌ అడ్వంచరస్‌ చిత్రమిది. ప్రస్తుతం శరవేగంగా  చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రూర్‌ స్వరాలందిస్తున్నారు. భువన్‌ గౌడ ఛాయాగ్రాహ కుడిగా వ్యవహరిస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని