Chiranjeevi: చిరు కుటుంబంలో పెద్ద పండుగ.. వీడియోలు వైరల్‌ - telugu news megastar birthday celebration videos trending in youtube
close
Published : 24/08/2021 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: చిరు కుటుంబంలో పెద్ద పండుగ.. వీడియోలు వైరల్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌.. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్‌ బిజీగా ఉంటున్నారు. దీంతో కుటుంబంలో జరిగే కొన్ని ఫంక్షన్లకు ఆయన సరిగ్గా సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. మెగా ఇంట వేడుకల్లో పవన్‌ కనిపించకపోవడం పట్ల అభిమానులు కూడా పలు సందర్భాల్లో నిరాశ చెందారు. వాళ్ల ఎదురుచూపులు, నిరాశకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ కొణిదెల కుటుంబంలో ఓ పెద్ద పండుగ జరిగింది. అదే మెగాస్టార్‌ చిరంజీవి 66వ పుట్టినరోజు. ఆదివారం జరిగిన ఈ వేడుకల్లో పవర్‌స్టార్‌ ప్రత్యేకాకర్షణగా నిలిచారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

పవన్‌ రాకతో అటు కుటుంబసభ్యులతోపాటు ఇటు అభిమానులు కూడా ఎంతో సంతోషించారు. పవన్‌ని చూడగానే చిరు ఆలింగనం చేసుకుని ప్రేమగా ముద్దుపెట్టుకున్నారు. అనంతరం వదినమ్మను చూసి.. ‘ఏంటండి సురేఖ గారు. ఎలా ఉన్నారు?’ అంటూ పవన్‌ ఆటపట్టించారు. ఇలా చెప్పుకొంటూ వెళితే ప్రతి ఫ్రేమ్‌ అభిమానులను ఫిదా చేసేలా ఉంది. దీంతో ఈ వీడియోలు యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి. చిరంజీవి బర్త్‌డే వీడియోలపై మీరు ఓ లుక్కేయండి..!







Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని