Liger: ‘లైగర్‌’ బిగ్‌ అప్‌డేట్‌.. విజయ్‌ దేవరకొండతో మైక్‌ టైసన్‌ - telugu news mike tyson as an actor in liger vijay deverakonda
close
Published : 27/09/2021 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Liger: ‘లైగర్‌’ బిగ్‌ అప్‌డేట్‌.. విజయ్‌ దేవరకొండతో మైక్‌ టైసన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాక్సింగ్‌ అంటే మైక్‌ టైసన్‌. టైసన్‌ అంటే బాక్సింగ్‌ అని చెప్పుకునేంతలా తనని తాను నిరూపించుకున్నాడు. అలాంటి టైసన్‌ వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ పండగలాంటి వాతావరణాన్నే దర్శకుడు పూరి జగన్నాథ్ చూపించనున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకి టైసన్‌ని నటుడిగా పరిచయం చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘లైగర్‌’. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. ఇందులో మైక్‌ టైసన్‌ నటిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌, విష్ణురెడ్డి, గెటప్‌ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్‌ సరసన అనన్య పాండే సందడి చేయనుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని