KTR: గిఫ్ట్‌ ఏ స్మైల్‌తో దివ్యాంగులకు చేయూత: కేటీఆర్‌  - telugu news minister ktr comments in gift a smile programme
close
Updated : 18/09/2021 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

KTR: గిఫ్ట్‌ ఏ స్మైల్‌తో దివ్యాంగులకు చేయూత: కేటీఆర్‌ 

హైదరాబాద్‌: నగరంలోని బేగంపేట టూరిజం ప్లాజాలో ఎంపీ రంజిత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ట్రై మోటార్‌ వాహనాలను పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని 105 మంది దివ్యాంగులకు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘ఎంపీ రంజిత్‌రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద దివ్యాంగులకు చేయూతనిస్తున్నారు. రాష్ట్ర సమస్యలపై రంజిత్‌ రెడ్డి పార్లమెంట్‌లో ప్రశ్నిస్తున్నారు. చేవెళ్లలోని ప్రభుత్వాసుపత్రులకు 7 అంబులెన్స్‌లు ఇచ్చారు. కరోనా కాలంలో అన్ని గ్రామాలకు డిజిటల్‌ టీవీలు అందించారు. దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. దివ్యాంగులు అనేక రంగాల్లో రాణిస్తున్నారు’’ అని కేటీఆర్‌ అన్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని