Srinivas Goud: ‘తమసోమా జ్యోతిర్గమయ’ బృందానికి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశంస - telugu news minister srinivas goud wishes tamasoma jyothirgamaya movie team
close
Updated : 25/10/2021 05:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Srinivas Goud: ‘తమసోమా జ్యోతిర్గమయ’ బృందానికి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశంస

హైదరాబాద్‌: చేనేత గొప్పతనాన్ని తెలియజేసేలా రూపొందిన ‘తమసోమా జ్యోతిర్గమ’ మంచి విజయం అందుకోవాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆకాంక్షించారు. తన కార్యాలయంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలిసి ఈ చిత్ర ట్రైలర్‌ని ఆదివారం చూశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ట్రైలర్‌ చాలా బాగుందని చిత్ర బృందాన్ని ప్రశంసించారు. చేనేత వృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆకలి చావుల నుంచి అంతర్జాతీయ స్థాయికి చేనేత అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. చేనేత గొప్పతనాన్ని అందరికీ తెలియజేసేలా ఈ చిత్రం రూపొందిందని, మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ బిడ్డలు తీసే చిత్రాలకి సినీ పెద్దలు సహకరించాలని కోరారు.

ఆనంద్‌రాజ్‌, శ్రావణి శెట్టి ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. విజయ్‌ కుమార్‌ బడుగు దర్శకుడు. గుణాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో విమల్ క్రియేషన్స్ పతాకంపై తడక రమేష్ నిర్మించారు. పోచంపల్లి పరిసరాల్లో చిత్రీకరణ జరుపుకొంది. అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించిన ఈ ట్రైలర్‌కి విశేష స్పందన లభించింది. ఈ చిత్రానికి కూర్పు, ఛాయాగ్రహణం: శ్రవణ్‌ జి. కుమార్‌, సంగీతం: ప్రశాంత్‌ బి.జె.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని