Hyderabad News: రాజేంద్రనగర్‌లో అదృశ్యమైన బాలుడి ఘటన విషాదాంతం - telugu news missing boy deadbody found
close
Updated : 28/08/2021 15:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hyderabad News: రాజేంద్రనగర్‌లో అదృశ్యమైన బాలుడి ఘటన విషాదాంతం

హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్రనగర్‌లో అదృశ్యమైన బాలుడి ఘటన విషాదాంతమైంది. ఇంట్లో ఆడుకుంటూ కనిపించకుండా పోయిన కుమారుడి కోసం రెండో రోజు తల్లిదండ్రులు గాలిస్తుండగా.. సమీపంలోని చెరువులో చిన్నారి మృతదేహం కనిపించింది. విగతజీవిగా బాలుడిని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారిని హత్య చేసి చెరువులో పడేసి ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సాయంత్రం అదృశ్యమైన బాలుడి కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో రాజేంద్ర నగర్‌ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని