Tollywood: ఆన్‌లైన్‌ టికెటింగ్‌.. ఏపీ సీఎం జగన్‌కి ముద్రగడ లేఖ - telugu news mudragada write a letter to ap cm jagan mohan reddy
close
Updated : 20/09/2021 22:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: ఆన్‌లైన్‌ టికెటింగ్‌.. ఏపీ సీఎం జగన్‌కి ముద్రగడ లేఖ

కిర్లంపూడి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం థియేటర్లకి సంబంధించి త్వరలోనే టికెటింగ్‌ వ్యవస్థని తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ విధానం సరైందంటూ, మాజీ ఎగ్జిబిటర్‌గా తన సూచనలు గౌరవించాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి ఓ లేఖ రాశారు. ‘సినిమా టికెట్లు ఆన్‌లైన్లో విక్రయించేలా చూడాలని ప్రముఖ నటులు మిమ్మల్ని కోరిన విషయం ఎమ్మెల్యే రోజా, మరికొందరు పెద్దలు వెల్లడించిన సంగతి పత్రికల్లో చూశాను. వారు కోరిన విధానం చాలా మంచిది. మాజీ ఎగ్జిబిటర్‌గా నేను కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నా. వీటిని అందరూ గౌరవించాలని కోరుకుంటున్నా. నటీనటులు, సాంకేతిక బృంద సభ్యులు, కార్వాన్లు, వసతి గృహాలు, భోజనం తదితర వాటికి సంబంధించిన ఖర్చుని నిర్మాత నుంచి తీసుకుని, ప్రభుత్వం దాన్ని నేరుగా సినిమా కోసం పనిచేసే వారి (నటీనటులు, సాంకేతిబృంద సభ్యులు తదితరులు) బ్యాంకు ఖాతాల్లోకి పంపిస్తే బాగుంటుంది. అప్పుడు ఎలాంటి అనవసర ఖర్చులు, ఎగవేతలు ఉండవు. ప్రతి పైసా ఎలా ఖర్చు చేశామో తెలుస్తుంది. బ్లాక్‌ మనీ అనే మాట వినిపించదు. వైట్‌ మనీతోనే వ్యాపారం నడుస్తుంది. చిత్ర నిర్మాణ వ్యయం తగ్గే అవకాశం ఉంది’ అని ముద్రగడ పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని