Shikhar Dhawan: నాయకుడిగా నా లక్ష్యం అదే! - telugu-news-my idea as a leader is to keep everyone together happy says dhawan
close
Published : 14/07/2021 20:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shikhar Dhawan: నాయకుడిగా నా లక్ష్యం అదే!

కొలంబో: అందరినీ కలుపుకొని జట్టును ముందుకు నడిపించడమే నాయకుడిగా తన లక్ష్యమని శిఖర్ ధావన్‌ అంటున్నాడు. శ్రీలంక పర్యటనలో టీమ్‌ఇండియాకు సారథ్యం వహించడం గొప్ప గుర్తింపుగా వర్ణించాడు. సానుకూల వైఖరితో ఆటగాళ్లను ఏకం చేయడం తనకు సంతోషకరమని వెల్లడించాడు. స్టార్‌స్పోర్ట్స్‌ షో ‘ఫాలో ద బ్లూస్‌’లో అతడు మాట్లాడాడు.

‘మా జట్టులో అద్భుతమైన కుర్రాళ్లు ఉన్నారు. తిరుగులేని సహాయక బృందం ఉంది. మేమంతా కలిసి గతంలోనూ పనిచేశాం. రాహుల్‌ (ద్రవిడ్‌) భాయ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. రంజీల్లో నేను అతడి జట్టుపై ఆడాను. అప్పట్నుంచే ఆయన నాకు తెలుసు. భారత్‌-ఏకు సారథ్యం వహించేందుకు వెళ్లినప్పుడు ఆయనే కోచ్‌’ అని శిఖర్‌ అన్నాడు.

‘ద్రవిడ్‌ ఎన్‌సీయే డైరెక్టర్‌ అయినప్పుడు మేం 20 రోజులు అక్కడికి వెళ్లేవాళ్లం. మేమెన్నో సార్లు కలుసుకొని మాట్లాడుకున్నాం. మా మధ్య సాన్నిహిత్యం ఉంది. మళ్లీ ఇప్పుడు కలిసి ఆరు మ్యాచులు ఆడబోతున్నాం. ఇదెంతో సరదాగా ఉండబోతోంది. మేమంతా ఒక్కతాటిపై ఉన్నాం’ అని ధావన్‌ తెలిపాడు.

‘జట్టులోకి అడుగుపెట్టి కలలను నిజం చేసుకుంటున్న కుర్రాళ్లను చూస్తుంటే సంతోషంగా ఉంది. వారంతా ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చారు. టీమ్‌ఇండియా ప్రయాణాన్ని వారు ఆస్వాదిస్తారు. వారి శక్తి సామర్థ్యాలేంటో, ఎలా మెరుగు పర్చుకోవాలో వారికి తెలుసు. వారి నుంచి మేం, మా నుంచి వారూ నేర్చుకుంటారు. ఎందుకంటే వారు కొత్తగా ఆలోచిస్తుంటారు. అవి మాకెంతో సాయపడతాయి’ అని ధావన్‌ తెలిపాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని