Nagababu: తుదిశ్వాస వరకూ నా బ్రదర్స్‌తోనే ఉంటా: నాగబాబు - telugu news nagababu perfect replay to a netizen about politics
close
Published : 01/10/2021 02:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nagababu: తుదిశ్వాస వరకూ నా బ్రదర్స్‌తోనే ఉంటా: నాగబాబు

సిద్ధాంతాలు వేరైనా..

హైదరాబాద్‌: వేర్వేరు సిద్ధాంతాలు, భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ తుదిశ్వాస వరకూ తన సోదరులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లను విడిచిపెట్టనని నటుడు నాగబాబు అన్నారు. బుధవారం ఇన్‌స్టా వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సెటైరికల్‌గా సమాధానాలు ఇచ్చిన ఆయన తాజాగా మరోసారి రాజకీయాల గురించి స్పందించారు. రాజకీయాలపై తనకి ఆసక్తి పోయిందని స్పష్టం చేశారు.

ఈ మేరకు ఓ నెటిజన్‌.. ‘రాజకీయాలంటే ఆసక్తిలేనప్పుడు మీరెలా ప్రజలకు సాయం చేయగలరు?’ అని ప్రశ్నించగా.. ‘అంటే రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు సేవ చేయాలి. లేకుంటే చేయకూడదు. అంతేగా.. అరెరే.. పెద్ద సమస్య వచ్చిందే.. ఈ విషయం తెలియక చాలా పొరపాటు చేశానే..! (కొంచెంసేపు జోక్స్‌ పక్కనపెడితే).. సిద్ధాంతాలు వేరైనప్పటికీ తుదిశ్వాస వరకూ నా సోదరులతోనే ఉంటాను. రాజకీయంగా కాకపోయినా.. కష్టాల్లో ఉన్నవారికి నాకు చేతనైనంత సాయం చేస్తాను’ అని నాగబాబు సమాధానమిచ్చారు. అనంతరం మరో నెటిజన్‌.. ‘మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే ఏం మారాలి?’ అని అడగ్గా.. ‘మగాడి మైండ్‌సెట్‌ మారాలంటూ’ నాగబాబు స్పందించారు. మరో నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘మంది ముందు మాట్లాడేవాడు పులి.. మంది వెనుక మాట్లాడేవాడు పిల్లి’ అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

మీరు తప్పు అని నిరూపిస్తా..

నెట్టింట్లో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే నాగబాబు తాజాగా ఓ ఆసక్తికరమైన సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘నేను బలహీనుడినని నువ్వు అంటే.. బలవంతుడినని చెప్పడం కోసం నేను సమయాన్ని వృథా చేయను. మరింత ధృడంగా మారి.. అసమానమైన శిఖరాగ్రాలను అధిరోహించి నువ్వు తప్పు అని నిరూపిస్తాను’ అని నాగబాబు పోస్ట్‌ పెట్టారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని