Nagarjuna: ఇవి ధరిస్తే నాన్న నాతోనే ఉన్నట్టుంటుంది: నాగార్జున - telugu news nagarjuna about his father akkineni nageswararao
close
Published : 20/09/2021 17:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nagarjuna: ఇవి ధరిస్తే నాన్న నాతోనే ఉన్నట్టుంటుంది: నాగార్జున

ఇంటర్నెట్ డెస్క్‌: తన తండ్రి, దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్‌)ని గుర్తుచేసుకుంటూ నాగార్జున భావోద్వేగానికి గురయ్యారు. నేడు ఏఎన్నార్‌ జయంతి సందర్భంగా వారి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘సెప్టెంబరు 20.. నాకు చాలా ప్రత్యేకమైన రోజు. నా హీరో, నా స్ఫూర్తి.. నాన్నగారి పుట్టినరోజు. నాన్నగారికి పంచెకట్టు అంటే చాలా ఇష్టం. పంచెకట్టులో ఆయన్ను చూస్తుంటే చాలా ముచ్చటేసేది. ముఖ్యంగా పొందూరు ఖద్దర్‌ని ఇష్టపడేవారు. నేను ధరించిందీ పొందూరు ఖద్దరే. ఈ నవరత్నాల హారం, నవరత్నాల ఉంగరం ఆయనవే. ఈ వాచ్‌ నా కంటే సీనియర్‌. ఆయన ఫేవరెట్‌ వాచ్ ఇది. ఇప్పుడు నాకు ఫేవరెట్ అయింది. ఇవన్నీ ధరిస్తే ఆయన నాతోనే ఉన్నట్టుంటుంది. ఏదో తృప్తి. ఏఎన్నార్‌ లివ్స్‌ ఆన్‌’ అని అన్నారు.

స్నేహితుడిలా చూశారు: చిరంజీవి

ఏఎన్నార్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రముఖ నటుడు చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మా మధ్య వయోబేధం ఉన్నప్పటికీ ఆయన నన్ను స్నేహితుడిలా భావించారు. ‘దేవదాస్‌’ నుంచి ‘మనం’ వరకు ఆయన నటించిన చిత్రాలన్నీ చిరస్థాయిగా నిలుస్తాయి’ అని అన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని