Nagarjuna: నాగార్జున యాక్షన్‌ షురూ - telugu news nagarjuna praveen sattaru film shoot resume
close
Published : 04/08/2021 19:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nagarjuna: నాగార్జున యాక్షన్‌ షురూ

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్న కథా చిత్రాల దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు  దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణ బుధవారం పునః ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సెట్‌కి సంబంధించిన ఓ ఫొటోని పంచుకున్నారు దర్శకుడు ప్రవీణ్‌. ఇందులో నాగార్జున కెమెరాను చూస్తూ కనిపించారు. లాక్‌డౌన్‌కి ముందు ఈ సినిమా తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాని యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా శ్రీ వేంకటేశ్వర ఎల్‌.ఎల్‌.పి., నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘రొటీన్‌ లవ్‌స్టోరీ’, ‘చందమామ కథలు’, ‘గుంటూర్‌ టాకీస్‌’, ‘గరుడ వేగ’ చిత్రాలతో విశేషంగా ఆకట్టుకున్న దర్శకుడే ప్రవీణ్‌ సత్తారు. ఇటీవల ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు నాగార్జున.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని