Nani: పవన్‌కల్యాణ్‌ మాటల్లో వాస్తవం ఉంది: నేచురల్‌ స్టార్‌ నాని - telugu news nani on pawankalyan yesturday speech
close
Updated : 26/09/2021 17:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nani: పవన్‌కల్యాణ్‌ మాటల్లో వాస్తవం ఉంది: నేచురల్‌ స్టార్‌ నాని

హైదరాబాద్‌: తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు వాస్తవమని నటుడు, నేచురల్‌స్టార్‌ నాని అన్నారు. శనివారం సాయంత్రం ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను సమర్ధించిన నాని తాజాగా ట్వీట్‌ చేశారు. ‘పవన్‌కల్యాణ్‌ సర్‌కి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మధ్య ఉన్న  విభేదాలను పక్కన పెడితే.. సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆయన చెప్పిన మాటలు వాస్తవం. ఆ సమస్యలపై త్వరితగతిన దృష్టి సారించాలి. సినీ పరిశ్రమ తిరిగి పూర్వవైభవం సొంతం చేసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌, ఆయా శాఖల మంత్రులు దయచేసి చర్యలు చేపట్టాలని కోరుతున్నాను’ అని నాని పేర్కొన్నారు.

పవన్‌కు కార్తికేయ మద్దతు

‘‘నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదా వ్యతిరేకించడం చేయడం లేదు. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి పవన్‌కల్యాణ్‌ ప్రస్తావించిన సమస్యలు పూర్తిగా వాస్తవం. నేను పరిశ్రమలో ఒక సభ్యుడు కావడం వల్ల మా అందరి తరపున మాట్లాడిన పవన్ సార్‌కి మద్దతు ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను’’ అని యువ నటుడు కార్తికేయ కూడా పవన్‌కు మద్దతు తెలిపారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు ఆపేసి లక్షల మంది పొట్టగొడుతున్నారు. పవన్‌కల్యాణ్‌ సినిమాను ఆపేసినా, అతనొచ్చిన చిత్ర పరిశ్రమని ఆపేసినా అందరూ భయపడి పోయి.. తమ దగ్గరికొస్తారని వైకాపా నాయకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త’ అంటూ పవన్‌కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సినిమా టికెట్లపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెత్తనం చలాయించేందుకు చూస్తుందంటూ ఆయన మండిపడ్డారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని