Cinema news: దేశభక్తిని రగిల్చిన 75 అద్భుత దృశ్య కావ్యాలివే! - telugu news national film development corporation poster
close
Published : 28/08/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema news: దేశభక్తిని రగిల్చిన 75 అద్భుత దృశ్య కావ్యాలివే!

దిల్లీ: భారతీయ సినిమా చరిత్రలో దేశభక్తిని రగిల్చిన అద్భుత చిత్రాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌.ఎఫ్‌.డి.సి) 75 ఉత్తమ భారతీయ చిత్రాల్ని ఎంపిక చేసింది. దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రాలివి. సంబంధిత పోస్టర్‌ని కేంద్ర మంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, కిషన్‌ రెడ్డి, ఎల్‌. మురుగన్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, మీనాక్షి లేఖిలు విడుదల చేశారు. వీటిల్లో అత్యధికంగా బాలీవుడ్‌ చిత్రాలున్నాయి. ‘లగాన్‌’, ‘బోర్డర్‌’, ‘భగత్‌సింగ్‌’, ‘గాంధీ’ తదితర ఉత్తరాది సినిమాల సరసన దక్షిణాది చిత్రాలు ‘రోజా’, ‘సైరా’, ‘కాలాపానీ’, ‘హే రామ్‌’ తదితర చిత్రాలు ఉన్నాయి. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు ‘ఐకానిక్‌ వీక్‌’గా ఈ వేడుక సాగుతుంది.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని