Maestro: ఓటీటీలోకి ‘మ్యాస్ట్రో’..  అలరిస్తోన్న ‘వెన్నెల్లో ఆడపిల్ల’ గీతం - telugu news nithiin film maestro on ott
close
Published : 06/08/2021 18:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Maestro: ఓటీటీలోకి ‘మ్యాస్ట్రో’..  అలరిస్తోన్న ‘వెన్నెల్లో ఆడపిల్ల’ గీతం

ఇంటర్నెట్‌ డెస్క్‌: నితిన్‌, నభా నటేశ్‌ జంటగా రూపొందిన చిత్రం ‘మ్యాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకుడు. హిందీలో విజయవంతమైన ‘అంధాధున్‌’ చిత్రానికి రీమేక్‌గా రూపొందించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలియజేసింది. త్వరలోనే ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ‘వెన్నెల్లో ఆడపిల్లే తనా’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. శ్రీజో, కృష్ణ చైతన్య సాహిత్యం అందించిన ఈ పాటకి మహతి స్వర సాగర్‌ సంగీతం అందించారు. స్వీకర్‌ అగస్తి ఆలపించారు. ఈ పాట వినసొంపుగా సాగుతూ అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. నితిన్‌, నభా నటన ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషించింది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాను సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. కథానాయకుడిగా నితిన్‌కి ఇది 30వ చిత్రం. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని