Nivetha Thomas: కిలిమంజారోపై నివేదా - telugu news nivetha Thomas Climb Kilimanjaro
close
Updated : 24/10/2021 09:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nivetha Thomas: కిలిమంజారోపై నివేదా

విభిన్నమైన పాత్రలు, సహజమైన నటనతో మెప్పించే నివేదా థామస్‌... నిజ జీవితంలో సాహసాలు చేస్తూ ఉంటుంది. అలా ఇటీవలే ఆమె ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆఫ్రికాలోని కిలిమంజారో నేషనల్‌ పార్క్‌లో ఈ పర్వతం ఉంది. దీన్ని అధిరోహించిన నివేద... ‘‘నేను సాధించాను. కిలిమంజారో పర్వతంపైన ఉన్నందుకు ఆనందంగా ఉంది.’’ అంటూ రాసుకొచ్చారు. ఇటీవలే ‘వకీల్‌సాబ్‌’లో అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన నివేదా ప్రస్తుతం ‘మీట్‌ క్యూట్‌’లో నటిస్తోంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని