RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ సెట్‌లో వాలీబాల్‌ ఆడిన తారక్‌-జక్కన్న.. వీడియో వైరల్‌ - telugu news ntr and rajamouli playing volleyball on rrr set video viral
close
Updated : 29/07/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ సెట్‌లో వాలీబాల్‌ ఆడిన తారక్‌-జక్కన్న.. వీడియో వైరల్‌

హైదరాబాద్‌: సినిమా తెరకెక్కించడమనేది సాధారణ విషయం కాదు. అందులోనూ భారీ బడ్జెట్‌, పాన్‌ ఇండియా సినిమా అయితే.. దర్శకుడు, నటీనటులపై ఉండే ఒత్తిడి మాటల్లో చెప్పలేం. అదేవిధంగా పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌. తారక్‌-రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ చివరిదశలో ఉంది. కాగా, నిర్విరామంగా జరుగుతున్న ఈ సినిమా షూట్‌ నుంచి తారక్‌-రాజమౌళి చిన్న బ్రేక్‌ తీసుకుని.. ఇతర బృందంతో కలిసి సరదాగా వాలీబాల్‌ ఆడారు. తారక్‌-జక్కన్న వేర్వేరు టీమ్‌లుగా విడిపోయి ఈ ఆటలో పాల్గొన్నారు. తారక్‌ టీమ్‌లో కీరవాణి కుమారుడు కాలభైరవతో పాటు, కార్తికేయ కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఓ వీడియో బయటకు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా తారక్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కనిపించనున్నారు. బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. చెర్రీ సరసన ఆలియాభట్‌, ఎన్టీఆర్‌ సరసన ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. అజయ్ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, ఇటీవల విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మేకింగ్‌ వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని