Ts News: కొడుకులు సరిగా చూసుకోవడం లేదు.. జడ్జిని ఆశ్రయించిన వృద్ధ దంపతులు - telugu news old age parents approach munsif judge for justice in kamareddy
close
Published : 24/09/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ts News: కొడుకులు సరిగా చూసుకోవడం లేదు.. జడ్జిని ఆశ్రయించిన వృద్ధ దంపతులు

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో వృద్ధ దంపతులు న్యాయమూర్తిని ఆశ్రయించారు. తమ పిల్లలు తమను ఆదరించడం లేదని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అచ్చాయిపల్లికి చెందిన బెస్త ఆశయ్యకు ఆరుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అందరూ వివాహాలు చేసుకొని స్థిరపడ్డారు. కుమారులందరూ పక్కా ఇళ్లలో ఉంటూ వృద్ధ దంపతులను రేకుల షెడ్డులో ఉంచారు. అన్నం పెట్టకపోవడం, తన పేరుపై ఉన్న భూమిని ఇచ్చేయాలంటూ కుమారులు ఇబ్బంది పెడుతున్నారని ఎల్లారెడ్డి మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి అనితకు వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన న్యాయమూర్తి.. వృద్ధ దంపతుల కుమారులు, కోడళ్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని.. లేదంటే చర్యలు తప్పవని న్యాయమూర్తి హెచ్చరించారు. దీంతో కుమారులు, కోడళ్లు వృద్ధ దంపతులకు క్షమాపణలు చెప్పారు. బాగా చూసుకుంటామని హామీ ఇచ్చి వారి ఇంటికి తీసుకెళ్లారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని