Siddharth: రాసిపెట్టుకో.. నిన్ను, నీ ఫ్యామిలీని అరెస్ట్‌ చేస్తా..! - telugu news orey baammardhi trailer out now
close
Published : 04/08/2021 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Siddharth: రాసిపెట్టుకో.. నిన్ను, నీ ఫ్యామిలీని అరెస్ట్‌ చేస్తా..!

హైదరాబాద్‌: ‘రాసిపెట్టుకో.. నిన్ను మాత్రమే కాదు నీ ఫ్యామిలీని కూడా అరెస్ట్‌ చేస్తా’ అని అంటున్నారు నటుడు సిద్దార్థ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బామ్మర్ది’. ‘బిచ్చగాడు’ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ ప్రాజెక్ట్‌ రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కీలకపాత్ర పోషించారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల అంతకంతకూ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 13న ‘ఒరేయ్‌ బామ్మర్ది’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యింది.

ఇందులో సిద్దార్థ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. బైక్‌ రేసులంటే ఆసక్తి చూపించే ఆవేశపరుడైన యువకుడి పాత్రను జీవీ ప్రకాశ్‌ పోషించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సిద్దార్థ్‌, జీవీ ప్రకాశ్‌ల నటన ఆకట్టుకునేలా సాగింది. ‘పోలీస్ లైఫ్‌లో క్రిమినల్స్‌తోనూ, వాళ్లు చేసే క్రైమ్స్‌తోనే బతకాల్సి వస్తుంది. డిపార్ట్‌మెంట్‌ లోపలైనా బయటైనా ఎవరితోనూ నిజాయతీగా ఉండలేకపోతున్నాను. కాబట్టి, ఈ లోకంలో ఎవరో ఒక్కరితోనైనా 200శాతం నిజాయతీగా ఉండాలనుకుంటున్నాను’ అని అంటూ సిద్దార్థ్‌ చెప్పిన పలు డైలాగ్‌లు మెప్పించాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని