Panchathantram: బ్రహ్మానందం ‘పంచతంత్రం’ టీజర్‌ వచ్చేసింది! - telugu news panchathantram teaser out now
close
Published : 13/10/2021 12:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Panchathantram: బ్రహ్మానందం ‘పంచతంత్రం’ టీజర్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కీలకపాత్రలో స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ‘పంచతంత్రం’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడు, గూడు, తోడు దొరికాక.. నాలుగో జీవనాధారం కోసం ఓ చోట కలుసుకున్నాయి. ఆ జీవనాధారమే కథలు. సింహం విసిరిన పంజా కథలు. చిరుత పెట్టిన పరుగు కథలు.. ఈగ చెప్పిన బాహుబలి కథలు.. వినటానికి వచ్చిన వాటికి మైక్‌ దగ్గర ఓ ముసలి తాబేలు కలిసింది...’ అంటూ సత్యదేవ్‌ ఇచ్చిన వాయిస్‌ ఓవర్‌ ఆకట్టుకునేలా ఉంది. నిత్యం జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో కథలను ఆధారంగా చేసుకుని ఈ ఫీల్‌ గుడ్‌ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్రబృందం చెబుతోంది. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్‌, సృజన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని