PV Sindhu: పీవీ సింధుకు పార్లమెంట్‌లో అభినందనలు - telugu news parliament congratulates pv sindhu for olympic medal win
close
Updated : 02/08/2021 11:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PV Sindhu: పీవీ సింధుకు పార్లమెంట్‌లో అభినందనలు

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధును పార్లమెంట్‌ ఉభయసభలు అభినందించాయి. వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే లోక్‌సభ స్పీకర్‌ సింధు విజయాన్ని ప్రస్తావించారు. ‘‘టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్యం సాధించడం ఆనందకరం. ఇది ఆమెకు వరుసగా రెండో ఒలింపిక్‌ పతకం. వ్యక్తిగత ఈవెంట్లలో రెండు పతకాలు అందుకున్న తొలి భారతీయురాలు ఆమే కావడం విశేషం. ఈ చారిత్రక విజయం అందుకున్న సింధుకు సభ సభ్యులందరి తరఫున అభినందనలు. ఆమె గెలుపు దేశ యువతకు స్ఫూర్తిదాయకం’’ అని స్పీకర్‌ ఓం బిర్లా కొనియాడారు. అటు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు కూడా సింధును అభినందించారు. తన అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించిందని ప్రశంసించారు. 

రాజ్యసభ వాయిదా..

మరోవైపు పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతిపక్షాల నిరసన పర్వం కొనసాగుతోంది. పెగాసస్‌, రైతు సంబంధిత అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ 12 గంటల వరకు వాయిదా పడింది. అటు లోక్‌సభలోనూ ఇదే గందరగోళం నెలకొనగా.. విపక్షాల ఆందోళనల నడుమే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని