Republic: సాయిధరమ్‌ తేజ్‌ చిత్రం.. ముఖ్య అతిథిగా పవన్‌ కల్యాణ్‌ - telugu news pawan kalyan as the chief guest in republic pre release event
close
Published : 23/09/2021 21:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Republic: సాయిధరమ్‌ తేజ్‌ చిత్రం.. ముఖ్య అతిథిగా పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్: సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా దర్శకుడు దేవకట్టా రూపొందించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. జీ స్టూడియోస్‌ పతాకంపై జె. భగవాన్‌, జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా అక్టోబరు 1న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 25న ముందస్తు విడుదల వేడుక (ప్రీ రిలీజ్ ఈవెంట్‌)ని చిత్రబృందం ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయిధరమ్‌ తేజ్‌ మామయ్య, ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ విచ్చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు దేవ కట్టా తన ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌ కలెక్టర్‌గా కనిపించనున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తోంది. సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల సమయంలో చిరంజీవి తెలిపారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని