Pawankalyan: యాహూ.. పవన్‌కల్యాణ్ - రానా మూవీ టైటిల్‌ ఇదే..! - telugu news pawan rana movie title announcement
close
Updated : 15/08/2021 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pawankalyan: యాహూ.. పవన్‌కల్యాణ్ - రానా మూవీ టైటిల్‌ ఇదే..!

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌-రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా రూపుదిద్దుకుంటోన్న సినిమా టైటిల్‌ ఖరారైంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ విషయంలో ఎన్నో పేర్లు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. వాటికి పుల్‌స్టాప్‌ పెడుతూ సినిమా టైటిల్‌ని చిత్రబృందం ఆదివారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ‘భీమ్లా నాయక్‌’ అనే పేరు ఖరారు చేశారు. ‘ఒరేయ్‌ డేనీ.. బయటకు రారా.. ’ అంటూ పవర్‌స్టార్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ‘డేని.. డేనియల్‌ శేఖర్‌’ అని రానా తన పేరు చెప్పగానే.. ‘భీమ్లా..భీమ్లా నాయక్‌.. ఏంటి చూస్తున్నావ్‌.. కింద క్యాప్షన్‌ లేదనా!! అక్కర్లేదు బండెక్కు’ అంటూ పవర్‌స్టార్‌ వేసిన డైలాగ్‌ అందరితో ఈలలు వేయించేలా ఉంది.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, బీజుమేనన్‌ ప్రధాన పాత్రలుగా మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పవర్‌ఫుల్‌ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ భీమ్లానాయక్‌ అనే పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. మాతృకలో బీజుమేనన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌, పృథ్వీరాజ్‌కుమార్‌ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యామేనన్‌, ఐశ్వర్యా రాజేశ్‌ కథానాయికలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సెప్టెంబర్‌ 2 నుంచి ‘భీమ్లానాయక్‌’ పాటలు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని