PelliSandaD: సహస్ర పెళ్లి నాతోనా? తొట్టిగ్యాంగ్ లీడర్‌తోనా? - telugu news pellisandad teaser released by nagarjuna roshan sreeleela
close
Published : 14/09/2021 16:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PelliSandaD: సహస్ర పెళ్లి నాతోనా? తొట్టిగ్యాంగ్ లీడర్‌తోనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘పెళ్లి సందD’. శ్రీలీల కథానాయిక. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ కథానాయకుడు నాగార్జున విడుదల చేశారు. బాస్కెట్‌ బాల్ ఆట నేపథ్యంలో సాగే సన్నివేశంతో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ‘సహస్రకి పెళ్లి నాతోనా? లేదా నువ్వు తెచ్చిన తొట్టిగ్యాంగ్‌ లీడర్‌తోనా?’ అని ప్రకాశ్‌రాజ్‌ని రోషన్‌ ప్రశ్నించిన తీరు మెప్పిస్తోంది. ఈ సినిమా యాక్షన్‌, రొమాన్స్‌, కామెడీ ప్రధానంగా రూపొందుతుందని టీజర్‌ చూస్తే అర్థమవుతుంది.

ఈ చిత్రంతో రాఘవేంద్రరావు నటుడిగా మారారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారాయన. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని