PoojaHegde: ‘రాధేశ్యామ్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన పూజా - telugu news pooja hegde gave update on radheshyam prabhas
close
Published : 24/07/2021 00:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PoojaHegde: ‘రాధేశ్యామ్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన పూజా

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. పరిస్థితులు బాగుంటే ఇప్పటికే ఈ సినిమా థియేటర్లో సందడి చేస్తుండేది. కానీ, లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది. దాంతో షూటింగ్‌ ఏ దశలో ఉంది? ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందంటూ ప్రభాస్‌ అభిమానులు ఆరా తీస్తూనే ఉన్నారు. తాజాగా ఈ వివరాల్ని పంచుకుంది నాయిక పూజా హెగ్డే. ‘రాధేశ్యామ్‌ చిత్రీకరణ తుది దశలో ఉంది. మరో వారం పదిరోజుల్లో షూటింగ్‌ పూర్తవుతుంది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత నిర్మాతలు ఈ సినిమాని విడుదల చేస్తారని అనుకుంటున్నా. నా పాత్ర విషయానికొస్తే.. ఇప్పుడు దాని గురించి మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు. సినిమా విడుదలకు ముందు ఆ విషయాలు చెప్తా. ఇదొక మెచ్యూర్‌ లవ్ స్టోరీ అని మాత్రం చెప్పగలను. ‘బాహుబలి’ వంటి యాక్షన్‌ చిత్రం తర్వాత ప్రభాస్‌ని రొమాంటిక్‌ కోణంలో చూడటం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమా కోసం మీలానే నేనూ ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని తెలిపింది పూజా. ఈ సినిమాతోపాటు చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’లో కీలక పాత్ర పోషిస్తుందామె. ఇందులో రామ్‌ చరణ్‌ సరసన కనిపించనుంది. హిందీలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘కబీ ఈద్‌ కబీ దీవాలీ’, రణ్‌వీర్‌ సింగ్‌ ‘సర్కస్‌’ చిత్రాల్లో నటిస్తుంది. తమిళంలో విజయ్ సరసన ‘బీస్ట్‌’లో సందడి చేయనుంది.

యువీ క్రియేషన్స్‌, టీ- సిరీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో ప్రేరణ అనే పాత్ర పోషిస్తుంది పూజా. రొమాంటిక్‌ పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ, కృష్ణంరాజు, మురళీ శర్మ, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని