Sundari: ‘సుందరి’ రాకకు వేళాయే - telugu news poorna starer sundari release date announcement
close
Published : 28/07/2021 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sundari: ‘సుందరి’ రాకకు వేళాయే

హైదరాబాద్‌: నటి పూర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న నాయికా ప్రాధాన్య చిత్రం ‘సుందరి’. కల్యాణ్‌ జీ గోగన దర్శకుడు. రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 13న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ‘‘కొత్తదనం నిండిన కుటుంబ కథాంశంతో ఈ సినిమా రూపొందించాం. పూర్ణ ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రలో నటించింది’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, కూర్పు: మణికాంత్, ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని