Prakash raj: అప్పుడే సమాజం మెరుగుపడే చిత్రాలొస్తాయి - ప్రకాష్‌రాజ్‌ - telugu news prakash raj launches bhagath singh nagar teaser
close
Published : 30/07/2021 09:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Prakash raj: అప్పుడే సమాజం మెరుగుపడే చిత్రాలొస్తాయి - ప్రకాష్‌రాజ్‌

హైదరాబాద్‌: ‘‘మన భగత్‌సింగ్‌లాంటి వారిని మళ్లీ పరిచయం చేయాలనే గొప్ప ఆలోచనతో సినిమాలు చేస్తున్న దర్శకులకి అండగా నిలవాలి. అప్పుడే సమాజం మెరుగుపడే చిత్రాలు వస్తాయి’’ అన్నారు ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌. ఆయన ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘భగత్‌సింగ్‌ నగర్‌’ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధార్థ్, ధృవిక జంటగా నటించిన చిత్రమిది. వాలాజా క్రాంతి దర్శకత్వం వహిస్తున్నారు. వాలాజా గౌరి, రమేష్‌ ఉడత్తు నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్నారు. టీజర్‌ ఆవిష్కరణ అనంతరం ప్రకాష్‌రాజ్‌ మాట్లాడుతూ ‘‘నాకు భగత్‌సింగ్‌ అంటే ఎంతో ఇష్టం. ఆయన ఉంటే ఈ దేశం ఇప్పుడు ఎక్కడ ఉండేదో. దర్శకుడు క్రాంతి ఎంచుకున్న కథ బాగుంది. ఇలాంటి మంచి సినిమాని నిర్మిస్తున్న వారిని చూసి గర్వపడుతున్నా’’ అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘భగత్‌సింగ్‌ రాసిన ఒక మాటని ఆదర్శంగా తీసుకుని, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని యథార్థ సంఘటలన ఆధారంగా ఈ సినిమాని తీశా’’ అన్నారు. ‘‘ఈ చిత్రం దర్శకుడు క్రాంతి కల కాదు. తన తండ్రి మునిచంద్ర కల. భగత్‌సింగ్‌ చనిపోయిన మార్చి 23వ తేదీన ఈ కుటుంబమంతా ఉపవాసం ఉంటుంది. ఇంత గొప్ప దేశభక్తి ఉన్న కుటుంబం నుంచి, భగత్‌ సింగ్‌ ఆలోచనతో వచ్చిన దర్శకుడే క్రాంతి. అతని తమ్ముడే కథానాయకుడు విధార్థ్‌. మునిచంద్ర కల కోసం కుటుంబమంతా కష్టపడి, మంచి సందేశంతో ఈ సినిమా తీశారు’’ అన్నారు దర్శకుడు బాబ్జి. దర్శకులు చంద్రమహేష్, వీరభద్రం, చిన్నికృష్ణ, నిర్మాతలు శ్రీకాంత్, సతీష్‌తోపాటు వెలిదొండ వెంకటేష్, సంతోష్, సంగీత దర్శకుడు ప్రభాకర్‌ దమ్ము పాల్గొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని