Tollywood: వినోదం పంచేందుకు సిద్ధమైన ఐమ్యాక్స్‌ - telugu-news-prasads multiplex will be opened from tomorrow
close
Published : 29/07/2021 22:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: వినోదం పంచేందుకు సిద్ధమైన ఐమ్యాక్స్‌

హైదరాబాద్‌: సినిమా అభిమానులకు వినోదాన్ని అందించేందుకు ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. కొత్త హంగులతో తీర్చిదిద్దిన ఐమాక్స్ మూడో అంతస్తు ప్రాంగణాన్ని ఇవాళ సిబ్బందితో కలిసి ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ యజమాని రమేష్ ప్రసాద్‌ ప్రారంభించారు. ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.

అనంతరం రమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘సామాన్య ప్రేక్షకుడికి సైతం అందుబాటు ధరలో సినిమా వినోదాన్ని అందించేందుకు ఐమ్యాక్స్ అన్ని రకాలుగా సిద్ధమైంది. కాలానుగుణంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ కొత్త హంగులు సంతరించుకుంటుంది. కొవిడ్ కష్టకాలంలో సినీ పరిశ్రమతోపాటు ప్రజలు చాలా నష్టపోయారు. ఈ క్రమంలో అందరికీ అందుబాటులో ఉండేలా మల్టీప్లెక్స్‌ను అన్ని జాగ్రత్తలతో తీర్చిదిద్దాం. ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చుకు వెనకాడకుండా ఐమ్యాక్స్ లో మార్పులు చేశాం’’ అని ప్రసాద్‌ తెలిపారు. కొత్త స్క్రీన్లు మంచి థియేట్రికల్ అనుభూతినిస్తాయి. సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు మంచి వాతావరణం కల్పించాలన్నదే మా ఉద్దేశం. ఈ మల్టీప్లెక్స్ కట్టిన నాటి నుంచి నేటి వరకూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా టెక్నాలజీనీ అప్‌డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. రెనొవేషన్ కోసం భారీగా ఖర్చు అయినప్పటికీ, ప్రేక్షకుల కోసం సరికొత్తగా మల్టీప్లెక్స్ ను తీర్చిదిద్దాం. త్వరలో ఐమాక్స్ స్క్రీన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. మా నాన్న ఎల్వీ ప్రసాద్ సినిమానే జీవితంగా బతికారు. దేశంలో ఒక గొప్ప నిర్మాతగా ఎదిగారు. ఆయన పిల్లలుగా మేం సినీ పరిశ్రమకు ఎంత సేవ చేయాలో అంతా చేస్తున్నాం. సినీ రంగంలో ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది’’ అని ప్రసాద్‌ తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని