TS News: ప్రసవ సమయంలో కడుపులో దూది మరచిపోయిన వైద్యులు.. గర్భిణీ మృతి - telugu news pregnant woman died in hyderabad
close
Updated : 21/09/2021 16:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: ప్రసవ సమయంలో కడుపులో దూది మరచిపోయిన వైద్యులు.. గర్భిణీ మృతి

భువనగిరి: ప్రసవం చేసే సమయంలో ఓ మహిళ కడుపులో వైద్యులు దూది మరచిపోవడంతో మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. ఏడాది క్రితం రాయగిరికి చెందిన మహిళకు యాదాద్రి భువనగిరిలోని కె.కె. ఆస్పత్రిలో ప్రసవం జరిగింది. ఆ తర్వాత నుంచి మహిళ కడపునొప్పితో బాధపడుతోంది. దీంతో బంధువులు ఆమెను ఇటీవల చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో మహిళ కడుపులో వైద్యులు దూదిని గుర్తించారు.

తొలి కాన్పు సమయంలో కడుపులో వైద్యులు దూది మరిచిపోయినట్లు తేలింది. కాగా, చికిత్స పొందుతూ ఆరు నెలల గర్భిణి ఇవాళ మృతి చెందింది. మహిళ కడుపులో దూది కారణంగా పేగులు దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో గర్భిణీకి తొలి కాన్పు చేసిన ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. మహిళ మృతికి ఆస్పత్రి వైద్యులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని