Pushpa: ‘పుష్ప’ పార్ట్‌ 1 విడుదల తేదీ ఖరారు - telugu news pushpa movie part 1 release announcement
close
Updated : 03/08/2021 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pushpa: ‘పుష్ప’ పార్ట్‌ 1 విడుదల తేదీ ఖరారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. దాంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఈ సినిమా తొలి భాగం డిసెంబరులో క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ని పంచుకుంది చిత్ర బృందం. ‘‘పుష్ప పార్ట్‌ 1’ ఈ డిసెంబరులో.. తగ్గేదే లే’’ అని పేర్కొంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో రష్మిక కథానాయిక. ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడటంతో డిసెంబరుకి వాయిదా వేశారు. ఈ సినిమాలోని తొలిగీతం ఆగస్టు 13న విడుదల కానుంది. 

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని