Pushpa: ‘పుష్ప’ సెకండ్‌ సింగిల్‌.. సిధ్‌ శ్రీరామ్‌ గానం అదిరింది! - telugu news pushpa second single promo allu arjun rashmika
close
Published : 12/10/2021 11:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pushpa: ‘పుష్ప’ సెకండ్‌ సింగిల్‌.. సిధ్‌ శ్రీరామ్‌ గానం అదిరింది!

ఇంటర్నెట్‌ డెస్క్: దర్శకుడు సుకుమార్‌, నటుడు అల్లు అర్జున్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌.. టాలీవుడ్‌లో ఈ కాంబినేషన్‌కి ఎంతో క్రేజ్‌ ఉంది. ఈ కలయికలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ‘పుష్ప’ చిత్రంతో మరోసారి వీరు తమ సత్తాని చాటుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని తొలిగీతం ‘దాక్కో దాక్కో మేక’ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ ఆల్బమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా రూపొందించిన రెండో పాటకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’ అంటూ సాగే గీతాన్ని తెలుగులో సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. చంద్రబోస్‌ రచించారు. పూర్తిగీతం ఈ నెల 13న విడుదలకానుంది.

ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీవల్లిగా రష్మిక సందడిచేయనున్నారు. మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. తొలి భాగం డిసెంబరు 17న విడుదలకానుంది.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని